నడిగర్ తిలకం శివాజీ గణేషన్ గురించి ప్రత్యేకంగా నేటితరం ప్రేక్షకులకు చెప్పాల్సిందే. ఎందుకంటే సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్నో చిత్రాలలో నటించి భారీ విజయాలను సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి సినీ పరిశ్రమకు ఉన్నత గుర్తింపును అందించారు. 1928 అక్టోబర్ 1 జన్మించిన ఈయన దక్షిణ ఆర్కాట్ జిల్లా విల్లుపురంలో స్వాతంత్ర సమరయోధులైన చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి గానూ చిన్నయ్యకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్షను విధించడం జరిగింది.

ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.. నేషనల్ పిక్చర్స్ వారి పరాశక్తి ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసిన ఈయన చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు అన్నాదురై అండ తో సినిమా పూర్తి చేసి మహానటుడిగా ఇండస్ట్రీలో ఎదిగారు. స్త్రీ వేషం కూడా కట్టే ఈయన తన అందమైన హావభావాలతో నాటకంలో సీత పాత్రను కూడా అవలీలగా పోషించి ప్రేక్షకులను మెప్పించారు. 300కు పైగా చిత్రాలలో నటించిన శివాజీ గణేషన్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు.  ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు శివాజీ నటించిన చాలా చిత్రాలు ఆంధ్రాలో కూడా విడుదల అయ్యేవి.

ఇక తమిళంలో బిఆర్ పంతులు నిర్మించిన కర్ణన్ చిత్రంలో శివాజీ కర్ణుడు పాత్రలో, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు ఇక ఆ చిత్రంలో శివాజీ నటన చూసి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయారు అంటే ఇక ఆయన నటన ఎంత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  ఇక అందుకే ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన చాణుక్య చంద్రగుప్త సినిమాలో శివాజీ గణేషన్ అలెగ్జాండర్ గా నటించారు. డి రామానాయుడు ప్రేమ్ నగర్ చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి వసంత మాలిగై పేరుతో రీమేక్ చేసి తమిళ్ చిత్రంలో సంచలనం సృష్టించడం జరిగింది. దాసరి నారాయణరావు కూడా ఆయనతో సినిమాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: