పలు చిత్రాలలో జానపద గీతాలు తెలంగాణ ఫోక్ సాంగ్ లతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సింగర్ మంగ్లీ.. పలు సినిమాలలో కూడా పలు పాటలు పాడడమే కాకుండా ఆ పాటలు మంచి పాపులారిటీ అవ్వడంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా శివుడి పాటలు వల్ల కూడా మరింత క్రేజ్ అందుకుంది మంగ్లీ. అలా తనకంటూ ఒక సపరేటు ఇమేజ్ సంపాదించుకున్న ఈమె మరొక పక్క ఆల్బమ్లతో బిజీగా మారిపోయింది. అయితే గత కొద్ది రోజుల నుంచి సింగర్ మంగ్లీ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.



ఇన్ని రోజులుగా మంగ్లీ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారడంతో ఆమె త్వరలోనే ఒక ఇంటి కోడలు కాబోతోందని పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు కూడా సిద్ధపడుతున్నారనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా మంగ్లీ తన బావ వరస అయ్యే వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది అని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీంతో తాజాగా ఈ విషయం పైన సింగర్ మంగ్లీ స్పందించినట్లు తెలుస్తోంది. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇస్తూ తాను ఇప్పుడప్పుడే వివాహం చేసుకునేది లేదని కరాకండిగా తెలియజేసింది. అసలు తనకు తెలియకుండానే తన పెళ్లి ఏంటి అంటూ ఒక్కసారిగా నవ్వేసింది.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంగ్లీ మాట్లాడుతూ ఏంటి నాకు పెళ్లా..ఓరి భగవంతుడా నాక్కూడా తెలియకుండానే నా పెళ్లి చేసేస్తున్నారా అంటూ నవ్వుతోంది.. ప్రస్తుతం పెళ్లి ఆలోచన అసలు లేదని మా బావతో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు.. ఇంతకీ బావతో ఏడడుగులు వేస్తున్నానన్నారు నాకు తెలియక అడుగుతున్నాను నాకే తెలియని నా బావ ఎవరో చెబుతారా అంటూ ఈ విషయం పైన స్పందించడం జరిగింది. తన బావ పేరు కచ్చితంగా చెప్పాలంటు సెటైర్లు వేయడం జరిగింది మంగ్లీ. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది దీంతో మంగ్లీ పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: