
నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్స్ ని కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. కానీ మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ రాలేదని కొన్ని సాంకేతిక కారణాలవల్ల మా ఆది కేశవ సినిమా ట్రైలర్ విడుదల వాయిదా వేయవలసి వచ్చింది అంటు తెలియజేశారు. అయితే చివరి నిమిషంలో ఇలా రద్దు చేసినందుకు మా మీడియా మిత్రులకు మరియు అభిమానులందరికీ కూడా క్షమాపణలు కోరుకుంటున్నాం అంటూ మేకర్స్ ఒక ట్విట్టర్ రూపంలో తెలియజేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేవారం ఈ సినిమా ఈవెంట్ ఉండబోతుందని ఈ చిత్రంలో మలయాళం స్టార్ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. శ్రీ లీల కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండడం చేత ఈ సినిమా సినిమా ట్రైలర్ ఈవెంట్ ని క్యాన్సల్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ లీల ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న తరుణంలో ఈమె కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొంటే కచ్చితంగా సినిమాకి హైపోస్తుందని చిత్ర బృందం భావించినట్లు సమాచారం.