యువసామ్రాట్ నాగ చైతన్య 'ధూత' వెబ్ సిరీస్‏తో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇచ్చారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్ పాత్రలో నటించారు చైతూ.విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‏లో పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ కీలకపాత్రలు పోషించారు. మొదటిసారి ఇంటెన్స్ పాత్రలో నటించారు చైతూ. ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన ధూత ప్రీమియర్ షోస్ చూసిన సినీ ప్రముఖులు చైతూ నటనపై ప్రశంసలు కురిపించారు. జర్నలిస్ట్ పాత్రలో చైతూ నటన అద్భుతమంటూ కొనియడారు. ఇప్పుడు ధూత సిరీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు అక్కినేని నాగార్జున. చైతూ నటన చూసి ఆశ్చర్యపోయానంటూ పోస్ట్ చేశారు."నిన్న రాత్రి చైతూ నటించిన ధూత సిరీస్ చూశాను. ఇప్పటివరకు తను ఉన్న కంఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటికి వచ్చి ఇలా నటించడం చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంది. ఈ సిరీస్ చూసి ఎగ్జయిట్ అయ్యాను. సస్పెస్స్ థ్రిల్లర్ ధూత సిరీస్ తెరకెక్కించిన బృందానికి అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు నాగ్. దీంతో చైతూ పై నాగార్జున ప్రశంసలు ధూత సిరీస్ కు మరింత రెస్పాన్స్ రావడంలో సందేహం లేదు.

ధూత సిరీస్ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు చైతూ. ఒక జర్నలిస్ట్ కథానాయికుడిగా తన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. ప్రతిదీ వార్త పత్రిక ద్వారా కనెక్ట్ అయి సన్నివేశారు రన్ అవుతుంటాయి. మొదట్లో దీనిని గా తీయాలనుకున్నారని వినిపించాయి. ఓటీటీలో అతీంద్రియ శక్తుల నేపథ్యంతో ఒక తీయాలనుకున్నారట డైరెక్టర్ విక్రమ్. కానీ చైతూకు హారర్ స్టోరీ కంటే ధూత కథ నచ్చిందని గతంలో తెలిపారు డైరెక్టర్ విక్రమ్.
2014లో దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన మనం సూపర్ హిట్ అయ్యింది. అదే సమయంలో చైతూతో ఓ హారర్ చేయాలనుకున్నారట. కానీ చైతూ హారర్ కంటే ధూత చేసేందుకు ఆసక్తి చూపించారని వెల్లడించారు. ధూత సిరీస్ కు నవీన్ నూలి ఎడిటింగ్, మికోలాజ్ సైగులా టోగ్రఫీ అందించారు. డిసెంబర్ 1, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా.. ప్రస్తుతం చైతూ తండెల్ చిత్రంలో నటిస్తున్నారు. చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. మత్స్యకారుల జీవితం చుట్టూ తిరిగే నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: