
అందులో భాగంగా బాలయ్య కి మూడు కథలు చెప్పిన బోయపాటి ఏ కథ తో వెళ్దామనే డైలమాలో పడ్డట్టుగా తెలుస్తుంది.ఇక ఈ మూడు కథలు బాలయ్య బాబుకి నచ్చడంతో ఇప్పుడు ఏ కథను ఫైనల్ చేసి ప్రేక్షకులకు ముందుకు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది... ఇదిలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇది కనక సక్సెస్ అయితే బాలయ్యకి ఇక తిరుగు ఉండదు. వరుసగా ఇప్పటికీ మూడు సినిమాలు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హిట్లు కొట్టిన సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు బాబీ సినిమాతో హిట్టు పడితే దాని తర్వాత వచ్చే బోయపాటి సినిమా ఎలాగూ హిట్టు పడుతుంది కాబట్టి వరుసగా ఐదు సినిమాలను హిట్లు కొట్టిన సీనియర్ హీరో గా ఎవరికి సాధ్యం కానీ రికార్డ్ ను తన పేరు మీద నెలకొల్పడానికి బాలయ్య బాబు రెడీ అవుతున్నాడు.