బాలీవుడ్ లో 2018 లో విడుదలైన చిత్రం స్త్రీ.. ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టించింది. కేవలం 17 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా 180 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది. కామెడీ హర్రర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నదని చెప్పవచ్చు.. భేదియా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అమర్ కౌశిక్ స్త్రీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతోనే డైరెక్టర్ గా మొదటిసారి పరిచయమయ్యారు.


ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు మరియు శ్రద్ధా కపూర్ నటించడం జరిగింది.అలాగే కీలకమైన పాత్రలో పంకజ్ త్రిపాఠి కూడా అద్భుతంగా నటించారు. 2018లో అత్యధిక కనెక్షన్లు సాధించిన ఈ సినిమా స్త్రీ-2 కూడా సిపిఎం రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వాన్ని వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ వైరల్ గా మారుతున్నది.


అదేమిటంటే ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది తమన్నా నటించిన జైలర్ సినిమాలోని స్పెషల్ సాంగ్ మంచి పాపులారిటీ అందుకుంది.ఈ సాంగ్ తో తమన్నా పెరిగిపోవడంతో పాటు డాన్స్ పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నది. తమన్నాకి ఉన్న క్రేజ్ కారణంగానే స్త్రీ-2 సినిమాలో ఈమెకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. దీంతో తమన్నా రెండవసారి స్పెషల్ సాంగ్ అలరించడానికి ముస్తాబ్ అవుతోంది అంటూ అభిమానులు తెలుపుతున్నారు. మరి ఏ మేరకు ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: