Rx -100 స్థాయిని మించి విజయాలు లేకపోయినా పాయల్ కు ఈ సినిమాతో మంచి సాలిడ్ హిట్ దొరికిందని చెప్పవచ్చు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ రైట్స్ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటిటి విడుదల తేదీ పై పలు రకాల వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 21 లేదా 22వ తేదీలలో మంగళవారం చిత్రం ఓటిటి లోకి రాబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.. అయితే తాజాగా సరికొత్త అప్డేట్ని సైతం చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.
టైటిల్ కి తగ్గట్టుగానే మంగళవారం అంటే డిసెంబర్ 19న లేదా 26వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటి లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మంగళవారం సినిమా ఆహ్వాన వస్తుందా లేకపోతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తుందా అనే విషయం పైన ఇంకా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. దీంతో త్వరలోనే అధికార తేదీ పైన కూడా చిత్ర బృందం క్లారిటీ ఇస్తామని తెలియజేశారు. ఇందులో నందితా శ్వేత, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రావణ్ రెడ్డి, శ్రీ తేజ ,తరుణ్ భాస్కర్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి