దక్షిణాది సినిమా రంగంలో భారీ సినిమాలకు చిరునామా ఎవరు అంటే శంకర్ రాజమౌళిల పేర్లు మాత్రమే చెపుతారు. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి రేంజ్ పెరిగి పోవడంతో శంకర్ తన సినిమాల విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు అని అంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య భారీ అంచనాలతో రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే విడుదల కావలసి ఉన్నప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపధ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. శంకర్ ఈ మూవీని పక్కకు పెట్టి కమలహాసన్ తో ‘ఇండియన్ 2’ తీస్తున్న నేపధ్యంలో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వాయిదా పడుతోంది అని అంటారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయమై నిర్మాత దిల్ రాజ్ కు కూడ స్పష్టమైన క్లారిటీ లేదు అని అంటారు.ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ దిల్ రాజ్ ఈ మూవీని సెప్టెంబర్ లో విడుదల చేస్తాము అంటూ అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతడు అలా చెప్పిన మరునాడే పవన్ కళ్యాణ్ సుజిత్ ల ‘ఓజీ’ సెప్టెంబర్ లో విడుదల అంటూ లీకులు వస్తున్న పరిస్థితులలో ‘గేమ్ ఛేంజర్’ సెప్టెంబర్ కు కూడ విడుదల కావడం కష్టం అని అంటున్నారు.అయితే ఈమూవీ విడుదల విషయమై శంకర్ ఎందుకు తన మౌన ముద్రను కొనసాగిస్తున్నాడు అన్నది ఇండస్ట్రీలో చాలామందికి అర్థం కావడం లేదు అని అంటారు. దీనితో ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల అవుతున్న పరిస్థితులలో సంక్రాంతికి కూడ ‘గేమ్ ఛేంజర్’ విడుదల అవ్వడం కష్టం అవ్వచ్చు అన్న అభిప్రాయం కొందరిలో ఉన్నట్లు తెలుస్తోంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: