తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డ్యాన్, ఫైట్స్, నటన ఇలా అన్ని విషయాల్లో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా లేవెల్లో దుమ్మురేపాడు అల్లు అర్జున్. తాజాగా మేడమ్ టుస్సాడ్స్ బన్నీ మైనపు విగ్రహావిష్కణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. వివరాల్లోకి వెళితే..ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు అల్లు అర్జున్. అయితే తాజాగా ఈ హీరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు.ఇదివరకే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ను సొంతం చేసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా సంచలనం సృష్టించిన బన్నీ.. ఇప్పుడు మరొక మైలు రాయిని అందుకున్నాడు.ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలు లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్నాయి. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విగ్రహం వచ్చి చేరింది. అయితే అది లండన్‌లో కాదు దుబాయ్‌లో.

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా దీనిని మార్చి 28న అంటే బన్నీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి రిలీజ్ రోజున ఓపెనింగ్ చేశారు. దీంతో తన ఫస్ట్ మూవీ రిలీజ్ రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ తెలిపాడు.కాగా ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ విగ్రహం అల వైకుంఠపురంలో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ ధరించి పుష్ప మేనరిజంతో తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. అయితే అలాంటి కాస్ట్యూమ్‌నే ధరించి బన్నీ ఆ ఓపెనింగ్‌కి వెళ్లాడు.ఆ విగ్రహం ఓపెనింగ్ అనంతరం బన్నీ, ఆ విగ్రహం పక్కపక్కన నిల్చున్న ఫోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో రియల్ బన్నీ ఎవరనేది పోల్చుకోవడానికి కాస్త సమయం పట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి.ఇకపోతే బన్నీ ప్రస్తుతం 'పుష్ప2' మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కడంతో సెకండ్ పార్ట్‌ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.'పుష్ప: ది రైజ్'తో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు బన్నీ. ఈ సినిమాకు గానూ నేషనల్ అవార్డు అందుకు తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఇన్స్టాగ్రామ్ అత్యధిక ఫాలోవర్స్ని సంపాదించుకున్న సౌత్ హీరోల్లో బన్నీదే టాప్ ప్లేస్. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం ఇలా సౌత్లో అందరికంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్ల ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా దుబాయ్లో తన మైనపు విగ్రహ ఆవిష్కరణతో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇలా అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ రికార్డు, ఘనతలు అందుకోవడం చూసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు.ఇదిలాఉండగా ఇప్పటివరకు మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు నుంచి ప్రభాస్‌, మహేష్‌ బాబు వంటి వారివి మాత్రమే మైనపు విగ్రహాలు ఉండగా తాజాగా ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. అయితే ప్రభాస్‌, మహేష్‌ బాబుల విగ్రహాలు లండన్ మ్యూజియంలో ఉండగా.. అల్లు అర్జున్‌ విగ్రహం మాత్రం దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్ల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం. దీంతో దక్షిణాది తొలి హీరోగా బన్నీ రికార్డ్‌ సెట్‌ చేశారు.

సింగపూర్‌, లండన్‌, దుబాయ్‌.. ఇలా పలు చోట్ల ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్‌  మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్ చేరారు. అంతే కాకుండా దుబాయ్‌ గోల్డెన్‌ వీసా అందుకున్న తొలి తెలుగుస్టార్‌ కూడా ఆయనే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: