నిన్న బెంగళూరు పట్టణంలో ఓ ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా ఓ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు అని, దానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా హాజరు అయ్యారు అని , అందులో నటి హేమ , శ్రీకాంత్ కూడా ఉన్నారు అని ఉదయం నుండి అనేక కథనాలు వస్తున్నాయి. దీనితో వెంటనే స్పందించిన హేమ నేను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదు. నేను ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నాను అని ఓ వీడియో విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇక శ్రీకాంత్ కూడా తాజాగా ఓ వీడియోని విడుదల చేశాడు.

అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ... నిన్న రాత్రి బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది అని , అందులో తెలుగు సినీ ప్రముఖులు అయినటువంటి హేమ మరియు శ్రీకాంత్ కూడా ఉన్నారు అని అనేక మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు. నాది రేవ్ పార్టీకి వెళ్లే కల్చర్ కూడా కాదు. ఎవరైనా బర్త్ డే కి పిలిచినా కానీ వెళ్తాను ఒక అర్థ గంట ఉండి వచ్చేస్తాను తప్ప ఇలాంటి తప్పుడు పార్టీలకు వెళ్లే కల్చర్ నాది ఏ మాత్రం కాదు.

మొన్నే నాకు నా భార్యకు విడాకులు ఇచ్చారు. ఇప్పుడేమో నేను రేవ్ పార్టీకి వెళ్లాను , పట్టు పడ్డాను అని కథనాలు రాస్తున్నారు. ఇక నేను రేవ్ పార్టీకి వెళ్లాను అని మీరు రాయడంలో కూడా పెద్దగా తప్పులేదు. ఎందుకు అంటే ఆ వీడియోలో చూపించిన వారిలో ఒక వ్యక్తి గడ్డం పెట్టుకొని ముఖాన్ని దాచుకుంటూ కొంచెం నాలాగే ఉన్నాడు. దానితో మీరు పొరపాటు పడి కూడా అలా రాసి ఉండవచ్చు.

కానీ అందులో ఉన్నది నేను కాదు. నేను ప్రస్తుతం నా ఇంటిలోనే ఉన్నాను. ఈ వీడియోలను చూసినప్పుడు నేను నా కుటుంబ సభ్యులు ఎంతో నవ్వుకున్నాం. ఇక అందులో ఉంది నేను కాదు కాబట్టి ఇకనైనా మీరు ఆ తప్పుడు వార్తలను రాయడం ఆపేయండి అంటూ శ్రీకాంత్ ఓ వీడియోని విడుదల చేసి నేను బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి వెళ్లలేదు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: