సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితారా ఘట్టమనేని గురించి తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ క్యూట్ అండ్ మల్టీ టాలెంటెడ్ గర్ల్‌ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో అప్‌డేట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది.పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి డిస్కషన్ పెడుతూ ఉంటుంది. అందంలో, అణకువలో, అభిమానులను ఆకట్టుకోవడంలో తండ్రికి మించిన తనయగా చిన్న వయస్సులోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈమె నెట్టింట షేర్ చేసిన ఫొటోస్, వీడియోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.సితార ఘట్టమనేనిని ఇన్‌స్టాలో అనుసరించేవారు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. ఇక ఆమె పేరెంట్స్ మహేశ్ బాబు, నమ్రత కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారే. నమ్రత ఒకప్పుడు సినిమాల్లో నటించి అలరించినప్పటికీ, ఇప్పుడు గృహిణిగా ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటోంది. మహేశ్ బాబు గురించి అయితే ఇక చెప్సాల్సిన అవసరం లేదు. అతను నటించే ప్రతీ సినిమా మరో లెవల్ అంతే. అభిమానుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ మిల్క్ బాయ్‌కి 40 ఏండ్లు దాటినా అదే ఫాలోయింగ్, అదే క్రేజ్ కొనసాగుతోంది.

తన డ్యాన్సులతో, డైలీ యాక్టివిటీస్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార పాపకు 'నాన్న కూచి' అనే నిక్ నేమ్ కూడా పెట్టేశారు మహేశ్ బాబు అభిమానులు. ఎందుకంటే ఆమె ఎక్కువగా మహేశ్ బాబుతో కలిసి ఉండే వివిధ యాక్టివిటీస్‌ను పంచుకుంటూ ఉంటుంది. మహేశ్ బాబుకు కూడా తన కూతురంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ, తన గారాలపట్టికి అన్ని విషయాల్లో సపోర్టుగా ఉంటాడు. ఇదిలా ఉండగా సితార ఘట్టమనేని గతంలో ఓ ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్, అలాగే క్లాతింగ్ షో రూమ్‌కు సంబంధించి కమర్షియల్ యాడ్స్ కూడా చేసింది. మోడల్‌గా అందరినీ అలరించింది. ఆ ఫొటోస్, వీడియోస్ ఆమె షేర్ చేయగా ఎంతోమందిని అలరించాయి.సితార ఘట్టమనేని, మహేశ్ బాబుకు కలిసి ఉండే పలు ఫొటోలు, వీడియోలు తరచుగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా.. మరోసారి సితార పాప తన తండ్రి మహేశ్ బాబుతో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్న వీడియో ఒకటి ప్రజెంట్ వైరల్ అవుతోంది. ఇందులో ఫొటోషూట్ సందర్భంగా సితారపాప తన తండ్రితో కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఆ సందర్భంలో ఆమె తండ్రి పక్కన నిల్చొని, అతని మొహంలోకి ప్రేమగా చూస్తూ.. గుండెలపై తలవాల్చుతూ ముసి ముసి నవ్వుతుండగా, మహేశ్ బాబు కూడా అంతే క్యూట్‌గా, ప్రేమగా తన కూతురును చూస్తూ మురిసిపోతున్నాడు. ఈ దృశ్యం అభిమానులను, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుండగా.. పలువురు అభిమానులు 'సంతూర్ డ్యాడ్', 'సూపర్ స్టార్ డ్యాడ్ యొక్క ప్రిన్సెస్' అంటూ కూటెస్ట్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: