పుష్ప-2 సినిమా టాలీవుడ్ లోనే మోస్ట్ అవైడడ్ చిత్రం గా పేరు సంపాదించింది. ఇప్పటికే పుష్ప-2 సినిమా నుంచి విడుదలైన పలు రకాల పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలె విడుదలైన పుష్ప-2 సాంగ్ ఏ రేంజ్ లో హిట్లయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఒక ఊపునిచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప-2 హుక్ స్టెప్ ద్వారానే సోషల్ మీడియాలో పలు రకాల రీల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి.తాజాగా వీరికి ఊపు ఇచ్చే విధంగా పుష్ప-2 నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ గురించి చిత్ర బృందం ఒక అప్డేట్ ను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్ రష్మిక మధ్య సాగేటువంటి రొమాంటిక్ సాంగ్ మే 29న ఉదయం 11:07 గంటల నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.. ఈ విషయాన్ని రష్మిక ప్రకటిస్తూ ఒక చిన్న వీడియో గ్లింప్ ను విడుద చేశారు.. సూసెకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. అంటూ సాంగ్ మొదలు కాబోతూ ఉంటుంది.. దేవిశ్రీప్రసాద్ మరొకసారి తన మ్యాజిక్ తో మాయ చేసారా కనిపిస్తున్నారు.సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప-2 సినిమాలో ఫహాద్ ఫాజీల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది.. ఫహాద్ పాజిల్ కి సంబంధించిన సన్నివేశాలు ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. జూన్ ఒకటో తారీకు పుష్ప సెట్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుసగా రెండు వారాలపాటు ఈ సినిమా షూటింగ్ చేస్తే అయిపోతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని స్పెషల్ సాంగ్ లో నటించేలా కనిపిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: