సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు.దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరు భావిస్తున్నారు.తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారా అంటూ నెటిజన్లు వీరిని ప్రశ్నిస్తున్నారు. గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు అల్లు అర్జున్, అట్లీ మూవీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో కూడా హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాన్నారమె.అయితే సమంత సడన్‌గా ఆశ్రమంలో ప్రత్యక్షమైంది. సద్గురు ప్రవచనాలు వింటూ, యోగ సాధన చేస్తూ ప్రశాంతతను పొందుతుంది. సమంత కోయంబత్తూర్ సద్గురు ఆశ్రమంలో ఉన్నారు. ఆమె సద్గురు బోధనలు వింటూ, ధ్యానం చేస్తూ మానసిక ప్రశాంతత పొందుతుంది. అయితే సమంత ఇలా మారిపోవడానికి శోభిత కూడా ఓ కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత నా మ్యారేజ్ లైఫ్‌లో ఎటువంటి తప్పు చేయలేదని తెలిపారని..సో నాగ చైతన్యనే తప్పు చేసి ఉంటారనే అభిప్రాయానికి నెటిజన్లు వచ్చేశారు.దీనికి తోడు నాగ చైతన్య, శోభిత కలిసి తిరగడం వల్లే సమంత ప్రశాంతత కోసం అధ్యాత్మికంలో వెళ్లారని చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: