టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం హరోంహర. ది రివోల్డ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‏ మూవీకి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో సుధీర్ జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాని జూన్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. హీరో, దర్శకుడితోపాటు చిత్రయూనిట్ కూడా విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు విడుదలకు ఒక్కరోజు ముందు ఈ మూవీ నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీం.సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు దాదాపు 44 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో కనిపించిన యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి.


1989 వ సంవత్సరపు కాలం నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తువ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు కుప్పం యాసలో అలరించనున్నట్లు తెలుస్తోంది. చివర్లో ఇక సెప్పెదేం లేదు.. సేసేదే అంటూ సుధీర్ చెప్పే డైలాగ్ అయితే హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్, టీజర్ తో విడుదలకు ముందే ఆసక్తిని కలిగించిన ఈ మూవీ కోసం సుధీర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సునీల్, రవికాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రేపు అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా తక్కువే. కేవలం 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రేపు విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: