
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా అందరి జనాలకు బాగా నచ్చేసింది. అయితే ఈ సినిమా చూసిన జనాలు ఒకటే ఒక మాట బాగా ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు. గ్లోబల్ స్థాయి సంపాదించుకున్న రాంచరణ్ ..గేమ్ చేంజర్ సినిమాతో ఫ్లాప్ టాక్ అందుకున్నాడు . ఈ సినిమా పై ఫస్ట్ నుండి ఓ నెగిటివ్ టాక్ వినిపించింది. ఫనల్ గా అదే నిజమైంది. శంకర్ డైరెక్షన్ వరస్ట్ అంటున్నారు జనాలు.
నందమూరి హీరో బాలయ్య నటించిన "డాకు మహారాజ్" సినిమా హిట్ అయిన అది మొత్తం ఊర నాటు మాస్ హిట్. తొడ కొట్టడాలు. అయితే కామెడీనే పెద్ద పీఠంగా చేసుకొని సంక్రాంతికి వస్తున్నాం సినిమాని సూపర్ డూపర్ హిట్ గా మలుచుకున్నాడు వెంకటేష్ . పెద్ద పాన్ ఇండియా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా .. కోట్ల బడ్జెట్ పెట్టకపోయినా.. వైలెన్స్ లేకపోయినా... కూడా సింపుల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని హిట్ చేసేసుకున్నాడు వెంకటేష్ అంటూ తెగ పొగిడేస్తున్నారు అభిమానులు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..!