మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వాహిస్తున్నారు. విశ్వంభర సినిమా యూవీ క్రియేషన్స్ పై వంశీ, విక్రమ్, ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో కునాల్ కపూర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మరో ఇద్దరు మెగా వారసులు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో పాటుగా స్క్రీన్ మీద కనిపించాలని చాలా మంది హీరో, హీరోయిన్స్ కి ఉంటుంది. కానీ మెగా వారసులు ఆయనతో స్క్రీన్ పైనే కనిపిస్తే ప్రేక్షకులకు పండుగే పండుగ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా చిరంజీవితో పాటుగా నటించే మరో ఇద్దరు మెగా వారసులు ఎవరా అన్న సందేహం చాలా మందికి ఉంది. అయితే ఆ వారసులు ఎవరు.. ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
విశ్వంభర మూవీలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, చిరంజీవి కాంబినేషన్ లో ఉండే కొన్ని సీన్స్ కూడా షూట్ చేయడం అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. గ్రాఫిక్స్ సరిగ్గా లేవంటూ కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. చిరంజీవి చాలా సినిమాలలో కెమెరామెన్ గా చోటా కే నాయుడు పని చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా కే నాయుడుయే కెమెరామెన్ అయినప్పటికీ కాస్త తేడా కొట్టినట్లు ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.   


మరింత సమాచారం తెలుసుకోండి: