బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తాజాగా జాట్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున హిందీ భాషలో విడుదల చేశారు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

ఇక జాట్ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతూ ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సమయంలో తాజాగా ఈ మూవీ బృందం వారు జాట్ 2 మూవీ కూడా ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ కూడా వైరల్ అవుతుంది. జాట్ 2 మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ రాగానే బాలయ్య అభిమానులు కాస్త టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. జాట్ 2 అప్డేట్ రావడానికి , బాలకృష్ణ అభిమానుల్లో టెన్షన్ మొదలు కావడానికి ప్రధాన కారణం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే ... జాట్ మూవీ విడుదల అయిన తర్వాత బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు బలంగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఈ కాంబో మూవీ ఓకే అయినట్లే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో మరోసారి ఈ క్రేజీ కాంబోలో మూవీ రాబోతుంది అనే వార్తలు వైరల్ కావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.

ఇక తాజాగా జాట్ 2 మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీ గా జాట్ 2 చేస్తాడా ..? లేక బాలయ్యతో సినిమా చేస్తాడా అనే విషయంలో బాలయ్య అభిమానులు కాస్త టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: