నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తనకంటూ నటుడిగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆఖరుగా నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఇక తాజాగా నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కే జీ ఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయమన్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేశారు. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ సేల్స్ ద్వారా దాదాపు 3 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా విడుదలకు చాలా రోజులు మిగిలి ఉంది. దానితో ఈ మూవీ కి విడుదలకు ముందే ప్రీ సేల్స్ ద్వారానే భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ కి విడుదలకు ముందు ప్రీ సేల్స్ ద్వారా ఎన్నో కోట్ల కలెక్షన్లు వస్తాయి అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: