టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ దర్శకులలో శైలిష్ కొలను ఒకరు. ఈయన విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత ఇదే సినిమాను హిందీలో హిట్ ది ఫస్ట్ కేస్ అనే టైటిల్తో రీమిక్ చేశాడు. కానీ ఈ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈయన అడవి శేషు హీరోగా హిట్ అది సెకండ్ కేస్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా శైలేష్ కొలను , నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాను మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనుండగా ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఏ ప్రీమియర్స్ ను ఏప్రిల్ 30 వ తేదీన ప్రదర్శించరున్నారు.

మూవీ ప్రీమియర్స్ కి యూ ఎస్ ఏ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ యూ ఎస్ ఏ ప్రీమియర్స్ కి 200 కే ప్లస్ సేల్స్ జరిగినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సూపర్ గా వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో నాని , శైలేష్ కొలను కి ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: