పూర్వకాలం నుండి ఉన్న లండన్ మ్యూజియం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ లండన్ మ్యూజియంని గతంలో మ్యూజియం ఆఫ్ లండన్ అని పిలిచేవారు. లండన్ మ్యూజియం పూర్వకాలం నుండి ఆధునిక కాలం వరకు ఉన్న చరిత్రను వివరిస్తుంది. అయితే ఈ మ్యూజియంలో ముఖ్యంగా సామాజిక చరిత్రకు సంబంధించిన వాటిని మనం చూడవచ్చు. లండన్ మ్యూజియంలో చోటు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది అంతా గొప్ప చరిత్ర కలిగి ఉన్న లండన్ మ్యూజియంలో మన తెలుగు స్టార్స్ మైనపు విగ్రహాలు ఉండడం చాలా గొప్ప విషయం.

ఇప్పటికే లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ కి చెందిన అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, స్టార్ నటి ఐశ్వర్యారాయ్, హీరో షారుక్ ఖాన్ మైనపు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మ్యూజియంలో కేవలం సినిమా ప్రముఖుల మైనపు విగ్రహాలు మాత్రమే ఉంటాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ మ్యూజియంలో సినీ ప్రముఖులతో పాటుగా స్పోర్ట్స్ మరియు అనేక రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు కూడా ఉంటాయి.  


ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అరుదైన గౌరవం మరో తెలుగు స్టార్ట్ హీరోకి దక్కింది. మరి ఆ స్టార్ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా.. అతను ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, స్టార్ హీరో రామ్ చరణ్. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని వచ్చే నెల 9వ తేదీన లంఛ్ చేయనున్నట్లు మ్యూజియం సిబ్బంది ప్రకటించింది. అనంతరం ఆ విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారని తెలిపింది. ఇక దీనికోసం కొన్ని నెలల క్రితమే రామ్ చరణ్, అలాగే ఆయన పెంపుడు కుక్క రైమ్ కు సంబంధించిన కొలతలను కూడా లండన్ మేడం టుస్సాడ్స్ సిబ్బంది తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్, మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వృద్ధి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ని కూడా పెట్టారు. పెద్ది మూవీలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: