
సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం నంబర్ వన్ హీరో అని ఒప్పుకోవడానికి అక్కడి విజయ్ అభిమానులు అస్సలు అంగీకరించరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. విజయ్ పొలిటికల్ రీజన్స్ తో సినిమాల నుంచి తప్పుకోవడానికి సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ విజయ్ ను ప్రాణంగా అభిమానించే కొంతమంది అభిమానులు ఎప్పటికీ విజయ్ నంబర్ వన్ హీరోగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఈ అనారోగ్యకరమైన వాతావరణం గురించి అజిత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. జనాల మధ్య ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు క్రేజ్ ఉన్నప్పుడు కొందరు మనపై ఈర్ష్య పడటం సహజం అని అజిత్ అన్నారు. స్టార్ డమ్ కు నెగిటివ్ సైడ్ కూడా ఉంటుందని అజిత్ కామెంట్లు చేశారు. అది నేను చాలా చూశానని అజిత్ చెప్పుకొచ్చారు.
అందుకే నేను పోటీని పట్టించుకోనని నా తరహాలోనే నేను ముందుకెళ్తానని ఆయన కామెంట్లు చేశారు. గొడవలను నేను అవైడ్ చేస్తానే తప్ప ఎస్కేప్ చేయనని అజిత్ పేర్కొన్నారు. నా యుద్ధం ఏంటో నాకు తెలుసని అందులో నేను గెలవాలని అనుకుంటానని అజిత్ వెల్లడించారు. ఎదుటి వ్యక్తి నా నుంచి కోరుకునే యుద్ధం ఎప్పటికీ చేయనని అజిత్ వెల్లడించారు. అజిత్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో అజిత్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.