హీరో సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ రేంజ్ లోనే ఆయన ఫ్యాన్ బేస్ ఉంటుంది . మరి ముఖ్యంగా సూర్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు అని ఆయన సెలక్షన్ ఆఫ్ మూవీస్ చాలా హైలెట్గా ఉన్నాయి అని ఈ మధ్యకాలంలో సూర్యకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపించాయి . సూర్య ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ లాంటి సినిమాలను ఓకే చేసి అందరి మనసులను కొల్లగొట్టాడు.  మరి అలాంటి సూర్య నుంచి "కంగువ" లాంటి ఒక మూవీ రావడం ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగా మారిపోయింది.


కంగువ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు.  కానీ కంగువా సినిమా ఫ్లాప్ అయ్యింది . కంగువ సినిమా ఇలా డిజాస్టర్ అవుతుంది అని ఫ్యాన్స్ ఊహించలేకపోయారు . అయితే కంగువ సినిమా ఫ్లాప్ అయిన ఏమాత్రం బాధపడని సూర్య "రెట్రో" మూవీతో ఆ బాధను తీర్చుకోవాలి అనుకున్నాడు . పాపం ఆయన బ్యాడ్ లక్..రెట్రో సినిమాపై పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న కానీ అంతా కూడా హిట్ త్రీ వైపే మళ్లి పోయారు . ఎక్కడ చూసినా హిట్ త్రీ మూవీ పోస్టులు టాక్ వైరల్ అవ్వడంతో..రెట్రో టాక్ తగ్గిపోయింది.



హీరో సూర్య నటించిన రెట్రో మూవీ పై జనాల ఫోకస్ తగ్గిపోయింది . దీంతో పూజా హెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో మూవీ కొంచెం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేద్దాము అని ఆశలు పెట్టుకున్న అటు సూర్యకి ఇటు పూజ హెగ్డే కి ఇది కోలుకోలేని షాక్ ఇచ్చింది . నిజానికి నాని కన్నా హీరో సూర్య పెద్ద స్టార్ . కచ్చితంగా ఆయన సినిమానే హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు . కానీ ఎవరు ఊహించని విధంగా నాని నటించిన హిట్ 3 సినిమా మంచి టాక్ అందుకుంది నాని పర్ఫామెన్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నింది.  ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 కోట్లు క్రాస్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: