ఫోక్ డ్యాన్సర్ జానూ లిరీ రెండో పెళ్లి వార్తలు ఎంత వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు. అయితే ఈ వార్తలపై స్పందించి చాలా ఎమోషనల్ కామెంట్లు చేసింది.అంతే కాదు వెక్కివెక్కి ఏడుస్తూ నా పర్సనల్ లైఫ్ ని గురించి ఇలా మాట్లాడడం ఏంటి.. జాను లిరి అలాంటిది ఇలాంటిది అంటూ నా మీద చెత్త కామెంట్లు చేస్తున్నారు. ఎవరితో తిరిగినా కూడా చెత్త చెత్తగా వార్తలు రాస్తున్నారు. అలాగే శేఖర్ మాస్టర్ తో కూడా ఎఫైర్ పెట్టుకున్నట్టు రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు. అడ్డమైన వాళ్ళు నన్ను కామెంట్లు చేస్తున్నారు.మా అమ్మ నాన్న ఎంతో గారాబంగా పెంచారు. కానీ ఇలాంటి వాళ్లతో నేను మాటలు పడాల్సి వస్తుంది. ఒక ఆడపిల్లను ఇంతలా టార్చర్ చేయడం మంచిది కాదు. ఈ మాటలు అన్నీ వింటూ ఉంటే నాకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ మాట్లాడింది. అయితే ఈ వీడియో వైరల్ అయిన కొద్ది గంటలకే మళ్ళీ ఓ సంచలన వీడియో అభిమాలతో షేర్ చేసుకుంది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందయ్యా అంటే.. నేను నిన్న చేసిన వీడియోకి చాలామంది నాకు సపోర్ట్ చేశారు. 

కొంతమంది విమర్శలు చేశారు.నేను చాలా రోజుల నుండి నా మీద వచ్చే కౌంటర్లను, కామెంట్లను పోస్టులను చూస్తూ ఉన్నా.కానీ అంతగా పట్టించుకోలేదు. అయితే రెండో పెళ్లి వార్తలపై కాస్త బాధనిపిచ్చి డిప్రెషన్ లోకి వెళ్లి అలాంటి మాటలు మాట్లాడాను. ఈ వార్తల వల్ల నా ఫ్యామిలీ ఎంతో మానసిక వేదన అనుభవిస్తుంది. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళాను. కానీ ఎవరికి భయపడి సూసైడ్ చేసుకుంటాను అని మాట్లాడలేదు. ఇక చాలామంది నా రెండో పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. అయితే నేను రెండో పెళ్లి చేసుకుంటే ఎవరికి నష్టం లేదు కదా.. ఇక నా అభిమానులందరికీ ఓ గుడ్ న్యూస్.నేను త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాను. నా కొడుకు నేను కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాము అంటూ జాను చెప్పుకొచ్చింది.

అయితే జాను మాట్లాడిన వీడియో వైరల్ అయిన కొద్ది క్షణాల్లోనే జాను పెళ్లి చేసుకోబోయే సింగర్ దిలీప్ దేవగన్ కూడా ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో దిలీప్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు నా పాటల్ని నన్ను ఆదరించినందుకు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞుడి గానే ఉంటాను. నేను రీసెంట్ గా ఓ ఫోటో పోస్ట్ చేయగానే దానిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే నేను జాను  ఇష్టపడ్డాం. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం మేం ఎలాంటి తప్పులు చేయలేదు. కలిసి బతకాలి అనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు జాను ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగే మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతుంది. కానీ ఆ ట్రోలింగ్ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ జాను పెళ్లి చేసుకోబోయే సింగర్ దిలీప్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోస్ వైరల్ అవ్వడంతో జాను లిరీ రెండో పెళ్లి వార్తల పై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: