కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనమే పక్క స్టార్ హీరోలకి మంచి పని చేస్తూ ఉంటాం.  తాజాగా అదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా నాని నటించిన హిట్ 3 సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో నానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.  ఇదే మూమెంట్లో గతంలో నాని - హీరో  వెంకటేష్ కి పరోక్షకంగా చేసిన సహాయం ఇప్పుడు తెరపైకి వచ్చింది .  ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే నాని న్యాచురల్ గా నటిస్తాడు .

సినిమా హిట్టా..?  ఫ్లాపా..? అనే ధ్యాస లేకుండా సినిమాకి 100% న్యాయం చేయాలి అంటూ కష్టపడతాడు . అటువంటి నాని కెరియర్ లో ఎన్నో  ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి . మరీ ముఖ్యంగా నాని కెరియర్ లోనే  పరమ చెత్త ఫ్లాప్ గా నిలిచిన మూవీ "దేవదాస్". అక్కినేని  నాగార్జున - నాచ్రల్ స్టార్ నాని మల్టీ స్టారర్ సినిమాగా నటించిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . నిజానికి ఈ సినిమాలో నాగార్జున పాత్రలో ముందుగా విక్టరీ వెంకటేష్ ని అనుకున్నారట మేకర్స్ .



కానీ అది సెట్ కాలేక పోయింది . విక్టరీ వెంకటేష్ వద్దకు ఈ పాత్ర వెళ్లకుండానే స్వయంగా నానినే ఈ క్యారెక్టర్ ని నాగార్జునకి ఇస్తే బాగుంటుంది అంటూ విక్టరీ వెంకటేష్ వద్దు అనే విధంగా పరోక్షకంగా చెప్పారట . ఈ సినిమా రిలీజ్ అయి పరమ చెత్త టాక్ అందుకుంది . నాగార్జునకు ఈ సినిమా వల్ల ఒరిగింది ఏమీ లేదు . పరోక్షకంగా నాని - వెంకటేష్ ని ఈ పాత్రకు సూట్ కాడు అంటూ రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అని ఆయన నెత్తిన పాలు పోసినంత పుణ్యం కట్టుకున్నాడు అంటూ వెంకటేష్ అభిమానులు తమదైన స్టైల్ లో ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో ట్రెండ్ చేశారు.  మరొకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ తెగ వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నాని పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతూ ఉండడానికి ది మెయిన్ రీసన్ హిట్ సినిమా అంటూ జనాలు తెగ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: