నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన బాలయ్య తన నటనకు గాను ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ హీరో నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. బాలకృష్ణ వయసు పెరిగినప్పటికీ అదే ఫిట్నెస్ కొనసాగిస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. 

ఇక బాలకృష్ణకు గత కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఆ కారణంగా హిందూపురంలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఒక నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదంటూ బాలకృష్ణ అన్నారు. ఎంతోమంది సినీ రంగంలోకి, రాజకీయాల్లోకి మచ్చి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ అందులో చాలామంది నేటి రోజున అడ్రస్ లేకుండా పోయారు.


నేను హిందూపురంలో పనులు గొప్ప చేశాను కాబట్టి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నా సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ఇచ్చింది. పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఓ ఆర్టిస్ట్ గా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం కానీ ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం తనను తాను గౌరవించుకుంటున్నట్లు అవుతుందని బాలకృష్ణ అన్నారు. అతి త్వరలోనే ఆయనకు భారతరత్న ఇవ్వాలనేది ప్రతి తెలుగు వాడి కోరిక అని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: