సినిమా ఇండస్ట్రీలో సెక్స్,రొమాన్స్ వంటి విషయాలను చాలా తేలికగా తీసుకుంటారు. బాలీవుడ్ లో ఉండే నటీనటుల పేరెంట్స్ సైతం చాలా ఓపెన్ గానే వీటి గురించి మాట్లాడుకుంటా ఉంటారు. అయితే బాలీవుడ్ కంటే హాలీవుడ్ లోనే ఎక్కువగా దీని గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటారు. కానీ బాలీవుడ్ లో ఉండే ఓ నటి తన కూతురికి అన్ని రకాల సుఖాలు తెలియాలని సెక్స్ టాయ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..అంత ధైర్యం చేసిన ఆ తల్లి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..బాలీవుడ్ నటి గౌతమి కపూర్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియక పోయినప్పటికీ బాలీవుడ్ జనాలకు మాత్రం సుపరిచితురాలు.ఈ హీరోయిన్ వెబ్ సిరీస్ లు, సినిమాలు చేసి నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్లు బీ టౌన్ లో వైరల్ గా మారాయి.

 నటి గౌతమి కపూర్ మాట్లాడుతూ.. నా కూతురి 16 వ బర్త్డేకి ఆమెకు వైబ్రేటర్ లేదా సెక్స్ టాయ్ గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నాను. అయితే నా అభిప్రాయం నా కూతురికి చెప్పినప్పుడు ఏంటమ్మా నీకు పిచ్చిగాని పట్టిందా.. ఎందుకు అలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగింది. కానీ నేను మాత్రం ఏ ఎందుకు నేను అది ఇవ్వకూడదా.. ప్రయోగాలు చేయకూడదా... నా తల్లి నాతో చేయని పని నేను నీతో చేయాలనుకుంటున్నాను. అయినా ఇందులో తప్పేమీ లేదు కదా..చాలామంది స్త్రీలు తమ జీవితంలో ఉన్న ఎన్నో రకాల కోరికలను, సుఖాలను అణచివేసుకుంటారు.కానీ ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను అలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను.

 నీకు సుఖం తెలియడం కోసమే ఈ విధంగా చెబుతున్నాను అని అన్నాను. అయితే ప్రస్తుతం నా కూతురికి 19 సంవత్సరాలు. ఆరోజు నేను చెప్పిన ఆ విషయానికి నా కూతురు ప్రస్తుతం నన్ను ప్రశంసిస్తుంది. నా కూతురు సియా కపూర్ కూడా అన్ని రకాల ఆనందాలు, సుఖాలు అనుభవించాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ గౌతమి కపూర్ చెప్పుకొచ్చింది. అయితే గౌతమీ కపూర్ మాట్లాడిన ఈ మాటలు చాలామందికి నచ్చడం లేదు. కూతురితో అంత ఓపెన్ గా మాట్లాడడం ఏంటి అని తిట్టిపోస్తున్నారు.ఇక మరి కొంతమందేమో ఆమె తీసుకుంది సరైన నిర్ణయమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: