( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే తో బ్యాడ్ టైమ్‌ బంతాడేస్తోంది. కెరీర్ ఆరంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నప్పటికీ.. ఆ తర్వాతి కాలంలో పూజా పాప స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. కానీ 2022 నుంచి పూజా గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చేది. ` రాధేశ్యామ్ ` మొదలు ఆమె ఖాతాలో వరుస ఫ్లాపులు పడుతూ వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు వ‌రుస‌గా ఏడు పరాజయాలను పూజా హెగ్డే మూట కట్టుకుంది.


ఈ జాబితాలో రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, బాలీవుడ్‌లో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా భారీ అంచ‌నాల న‌డుమ‌ విడుదలైన ` రెట్రో ` సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో త‌మిళ స్టార్ హీరో సూర్య‌తో పూజా హెగ్డే జ‌త‌క‌ట్టింది. వింటేజ్ లుక్ లో పూజా ఆకట్టుకున్న‌ప్ప‌టికీ.. సినిమా మాత్రం డిజాస్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతుంది. రెట్రోతో వ‌రుస‌గా ఏడు ఫ్లాపులు ప‌డ‌టంతో పూజా హెగ్డే కెరీర్ ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.


చాలా సినిమా ఆఫ‌ర్లు చేతిదాక వ‌చ్చినట్లే వ‌చ్చి చేజారిపోతున్నాయి. ఇక ఇలాంటి త‌రుణంలో పూజా పాప‌ను ఇద్ద‌రే ఇద్ద‌రు కాపాడ‌గ‌ల‌రు. అందులో ఒక‌రు ద‌ళ‌ప‌తి విజ‌య్ కాగా.. మ‌రొక‌రు రాఘవ లారెన్స్. విజ‌య్ తో పూజా హెగ్డే ప్ర‌స్తుతం ` జన నాయ‌గ‌న్ ` అనే సినిమా చేస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ విజ‌య్ కెరీర్ లో చివ‌రి చిత్ర‌మ‌ని చెబుతున్నారు. అలాగే మ‌రోవైపు రాఘ‌వ లారెన్స్ తో క‌లిసి పూజా `కాంచన 4`లో యాక్ట్ చేయ‌బోతుంది. బుట్టబొమ్మ కెరీర్ లో తొలి హార‌ర్ చిత్ర‌మిది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు సినిమాలు పూజా కెరీర్ కు కీలంగా మారాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే పూజాకు మ‌ళ్లీ అవ‌కాశాలు త‌లుపుత‌డతాయి. లేదంటే ఆమె కెరీర్ క్లోజ్ అయిన‌ట్లే అని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: