
ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు ఫిలిం వర్గాలలో బాగా చక్కర్లు కొడుతుంది . జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్ లో మెరవబోతుందట. ఆల్రెడీ శృతిహాసన్ జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీళ్ళ జోడికి కూడా మంచి మార్కులు పడ్డాయి . అయితే ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్లీ వీళ్ళ కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది . ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది.
ఆ టైం లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - శృతి హాసన్ మధ్య ఏర్పడిన బాండింగ్..చనువుతో మరొక అవకాశం శృతిహాసన్ కి ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు త్వరలోనే ఎన్టీఆర్ - శృతిహాసన్ లపై ఈ సాంగ్ ను చిత్రీకరించిపోతున్నారట . ఊటీలో ఈ సాంగ్ షూటింగ్ చిత్రీకరించబోతున్నట్లు ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ ఫుల్ మాస్ గా ఉండబోతుంది అని ..నాటు నాటు స్టెప్స్ తో ఎన్టీఆర్ - శృతిహాసన్ విజృంభించే రేంజ్ లోనే ఈ పాటను డైరెక్ట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ అంటూ మేకర్స్ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???