
విడుదలైన ఆరు రోజుల్లో అన్ని ఏరియాల్లో మూవీ బ్రేక్ ఈవెన్ కావడం చాలామంది హీరోలకు తమ కెరీర్ లోనే సాధ్యం కాదు. నాని మాత్రం హిట్3 సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగినా అలవోకగా ఈ రికార్డును సాధించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి సైతం మంచి పేరు వచ్చింది. మాస్ ఏరియాలలో సైతం హిట్3 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ను అందుకుంది.
ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకున్న 6వ సినిమాగా హిట్3 నిలిచింది. ఈ సినిమా సక్సెస్ మే నెలకు శుభారంభాన్ని ఇచ్చింది. సెకండ్ వీకెండ్ ను సైతం ఈ సినిమా పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే ఛాన్స్ అయితే ఉంది. వరుస విజయాలు సాధిస్తున్న నాని ప్రతి సినిమాతో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు.
ఓవర్సీస్ లో సైతం అలవోకగా 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధిస్తూ ఇతర స్టార్ హీరోలకు తన రికార్డులతో గట్టి పోటీ ఇస్తున్నారు. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని పాత్రకు అనుగుణంగా తనను తాను మలచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ది ప్యారడైజ్ సినిమాతో నాని మరిన్ని సంచలనాలను సాధించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారీ లాభాలను అందించిన హిట్3 రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలను సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పవచ్చు.