
హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. ఇక ఈ నెల 1న హిట్ 3 సినిమా థియేటర్ లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హిట్ : ది థర్డ్ కేస్ సినిమా విడుదల అయ్యి కోట్లలో కలక్షన్స్ ని వసూలు చేసింది. ఈ హిట్ 3 సినిమా రిలీజ్ అయ్యి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ మీట్ లో హీరో నాని మాట్లాడుతూ.. ఈ కాంబో మళ్లీ రిపీట్ అవ్వనుందని అన్నారు. నాని, శైలేష్ కొలను కలయికలో మరో సినిమా తెరకెక్కుతుంది అని తెలిపారు. కానీ ఈ సారి వీరిద్దరి కాంబోలో వైలెన్స్ ఉండదని చెప్పారు. హిట్ 3 ల కాకుండా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరపైకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది తెలీదు కానీ తప్పకుండా తీస్తానని నాని ప్రామిస్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతుంది.