టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత నుండి పవన్ అంత యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు. కానీ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఆ ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం , బిజెపి లతో పొత్తుల భాగంగా పోటీ చేసింది. ఆ ఎన్నికలలో జనసేన పార్టీ 100 శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. దానితో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లలో పాల్గొనడం చాలా కష్టంగా మారింది. కానీ పవన్ , ఉపముఖ్యమంత్రి కాకముందు కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మూవీలను ప్రస్తుతం పూర్తి చేస్తూ వస్తున్నాడు. కానీ కొత్త మూవీలను మాత్రం ఓకే చెప్పడం లేదు.

దానితో పవన్ అభిమానులు పవన్ ప్రస్తుతం గతంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ వస్తూ ఉండడంతో ఆ సినిమాలు త్వరలో విడుదల అవుతాయి అని ఆనంద పడుతున్నప్పటికీ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వారు మరో వైపు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి పవన్ రాబోయే కాలంలో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..? లేక కేవలం ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను మాత్రమే చేసి సినిమాలకు దూరంగా ఉంటాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: