
ఈ వ్యక్తుల సిద్ధాంతాలను కృష్ణమోహన్ రెడ్డి హృదయపూర్వకంగా అనుసరించారని ప్రజలకు సేవ చేయాలనే ధృఢ నిశ్చయంతో జీవించారని ఆమె కామెంట్లు చేశారు. కృష్ణ మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత విశ్వసనీయమైందో ఆయన విధేయత ఎంత నిజమైందో అందరికీ తెలుసని ఆమె కామెంట్లు చేశారు. కృష్ణ మోహన్ రెడ్డి త్వరలోనే విడుదలవుతారని ఆమె చెప్పుకొచ్చారు.
కృష్ణమోహన్ రెడ్డి నిర్దోషిత్వం ప్రజల ముందుకు స్పష్టంగా రాబోతుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని శ్యామల చెప్పుకొచ్చారు. నిజాయితీ, విలువలతో సేవ చేసే వ్యక్తులు సమజానికి ఎంతో అవసరమని శ్యామల పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఎంతోమంది అరెస్ట్ కాగా శ్యామల మాత్రం కేవలం కృష్ణ మోహన్ రెడ్డికి అనుకూలంగా పోస్ట్ పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శ్యామల పరోక్షంగా వైసీపీకి తీరని నష్టం చేస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. యాంకర్ శ్యామల ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విమర్శల పాలు అవుతున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. శ్యామల గారు భవిష్యత్తులో సైతం విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో శ్యామల తీరు మారుతుందేమో చూడాల్సి ఉంది. శ్యామల విషయంలో వైసీపీ అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు