సినీ నటి రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ బ్యూటీ అందాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ భామ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ లలో ఒకరు. ఈ అందాల భామ రణబీర్ కపూర్ తో కలిసిన నటించిన యనిమాల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి.. మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో ఛావా సినిమాలో నటించింది. ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. రష్మిక ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా రష్మికను హీరోయిన్ సౌందర్యతో పోల్చారు. ఇద్దరు ఒకేలా ఉన్నారంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఆ పోస్ట్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌందర్యతో రష్మికకు పోలిక అంటూ ఫైర్ అయ్యారు. రష్మిక బావుంటుంది కానీ దేవత లాంటి సౌందర్య గారితో పోల్చకండి అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: