
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరపైకి రాబోతున్న చిత్రం థగ్ లైఫ్. భారీ అంచనాల మధ్య జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ చేపట్టిన చిత్ర బృందం అందులో భాగంగా నిన్న సాయంత్రం 5:00 గంటలకు సినిమా నుండి తమిళ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ లో కనిపించిన కొన్ని షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి..
గతంలో టాలీవుడ్ పై తమిళ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోల్స్ చేస్తే.. ఇప్పుడు కమలహాసన్, త్రిష మధ్య సన్నివేశాలు చూసేసరికి మన తెలుగు ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. ఓవరాల్గా మంచి స్పందన వచ్చినా . ఇలాంటి సన్నివేశాలు మాత్రం ఇప్పుడు ఊహించిన విధంగా మారిపోయాయి. మొత్తానికి అయితే ఇది టాలీవుడ్ కి రివేంజ్ టైం అని ముసలోడే కావాల్సి వచ్చిందా అంటూ అటు త్రిషపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.