టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. దానితో ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేయడానికి అనేక మంది నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఓ లేడీ నిర్మాత కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని ఉంది అని , అలాగే ప్రభాస్ తో ఓ క్రేజీ జోనర్ మూవీ చేయాలని ఉంది అని తాజాగా కామెంట్స్ చేసింది.

ఇంతకు ప్రభాస్ తో సినిమా చేయాలని ఉంది అని చెప్పుకొచ్చిన ఆ లేడీ నిర్మాత ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు. నాగబాబు కుమార్తె అయినటువంటి నిహారిక. నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు నటిక ఏ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. ఇకపోతే ఈమె ఈ మధ్య కాలంలో వరస పెట్టి సినిమాలను నిర్మిస్తుంది. కొంత కాలం క్రితం ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ ని నిర్మించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నిర్మాతగా నిహారిక కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈమె సంగీత్ శోభన్ హీరో గా రూపొందుతున్న సినిమాను నిర్మిస్తుంది.

తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె ప్రభాస్ తో ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ మరియు హిరెలియస్ ఎంటర్టైనర్ మూవీ చేయాలని ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ లో నటిస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజి అనే మూవీ లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: