
వాస్తవానికి ఈమూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఎంపిక చేసి ఆమెకు ఒక సంవత్సరం పాటు మరే సినిమాలో నటించకూడదు అన్న కండిషన్ ప్రశాంత్ నీల్ ఆమెకు పెట్టాడు అన్న వార్తలు వచ్చాయి. ఆమె అప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ఆమె ఒక మూవీ ఒప్పుకోవడం జరిగింది అని అంటున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో మణి రత్నం ‘దగ్ లైఫ్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ మూవీ జూన్ లో విడుదల కాబోతున్న నేపధ్యంలో ప్యూర్ లవ్ స్టోరీగా నిర్మాణం జరుపుకోబోయే ఒక క్యూట్ మూవీలో ‘రుక్మిణీ వసంత్’ కీలక పాత్రకు మణిరత్నం ఎంపిక చేయడంతో రుక్మిణీ వసంత్ తనకు మణి రత్నం మూవీలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేక ఒకవైపు ప్రశాంత్ నీల్ సినిమాలో జూనియర్ పకన్న హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు మణి రత్నం మూవీలో కూడ నటించాలి అని రుక్మిణీ వసంత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రశాంత్ నీల్ సహకారం లభిస్తుంది అన్న సందేహాలతో కన్నడ మీడియా ఊహాగానాలు చేస్తోంది.
ప్రస్తుతం సితార బ్యానర్ లో ‘అనగనగా ఒక రాజు’ మూవీ చేస్తున్న నవీన్ పోలిశెట్టి రుక్మిణీ వసంత్ లతో మణిరత్నం మూవీ ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. నవీన్ పోలిశెట్టి సినిమాలు అంటే కామెడీ టైమింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే మణి రత్నం రత్నమ్ స్థాయిలో ప్యూర్ లవ్ స్టోరీ మూవీకి ఈ కాంబినేషన్ బాగుంటుందా అన్న సందేహాలు కూడ చాల మందిలో ఉన్నాయి..