ఏంటి సిమ్రాన్ నిజంగానే జ్యోతిక పరువు తీసిందా..జ్యోతిక పరువు తీసేంతలా సిమ్రాన్ ఏం మాట్లాడింది..వీరి మధ్య ఉన్న వివాదం ఇంకా ముదురుతూనే ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా మోహన్లాల్ తో కలిసి సిమ్రాన్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా హిట్ కొట్టడంతో సిమ్రాన్ ఆనందంతో ఎన్నో ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతుంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతికతో ఉన్న గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది.. సిమ్రాన్ మాట్లాడుతూ..జ్యోతికతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. అయితే నేను డబ్బా రోల్స్ అని చెప్పింది జ్యోతిక గురించి మాత్రం కాదు. అయితే నేను మాట్లాడిన మాటలను కావాలనే కొంత మంది వక్రీకరించి ఇలా నెగటివ్ చేశారు. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పనిలేదు.

అయితే నన్ను జ్యోతిక తప్పుగా అర్థం చేసుకుంది. దాంతో ఆమెనే నాకు ఫోన్ చేసి నేను ఆరోజు అలా అని తప్పు చేశాను. అలా అని ఉండకూడదు సారీ అంటూ క్షమాపణలు అడిగింది. ఇక ఆమె క్షమాపణలు అడిగిన రోజే మా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయి. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు అంటూ చెప్పుకొచ్చింది సిమ్రాన్. అయితే గతంలో సిమ్రాన్ ఓ అవార్డ్స్ ఫంక్షన్లో కొంతమంది హీరోయిన్లు డబ్బా రోల్స్ చేస్తూ మిగతా వారిని విమర్శిస్తూ ఉంటారు. ఆంటీ పాత్రలు అమ్మ పాత్రలు చేయడం కంటే ఈ పాత్రలు చేయడం మంచిది అంటారు. కానీ  అలాంటి డబ్బా పాత్రలు చేయడం కంటే ఆంటీ పాత్రలు చేయడమే నా ద్రుష్టిలో చాలా బెస్ట్  అని మాట్లాడింది.

అయితే సిమ్రాన్ మాట్లాడింది జ్యోతిక చేసిన డబ్బా  కార్టెల్  వెబ్ సిరీస్ గురించి అని జ్యోతిక ని తక్కువ చేసి మాట్లాడిందని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సిమ్రాన్ మాటలు వైరల్ చేశారు. దాంతో వీరి మధ్య కొద్ది రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ తాజాగా సిమ్రాన్ జ్యోతిక నాకు క్షమాపణలు చెప్పింది అని చెప్పడంతో మరోసారి వీరి ఇష్యూ బయటకు వచ్చింది.అయితే సిమ్రాన్ మామూలుగానే చెప్పినప్పటికీ కొంతమంది నెటిజన్స్ మాత్రం సిమ్రాన్ మళ్ళి జ్యోతికను అవమానించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: