
ఇందుకు సంబంధించిన కొన్ని వాట్సాప్ చాట్స్ సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం గురించి కందుల దుర్గేశ్ పోలీసులతో విచారణ చేయిస్తున్నారు. పోలీసుల విచారణలో ఇందుకు సంబంధించి ఎలాంటి విషయాలు రివీల్ అవుతాయో చూడాల్సి ఉంది. వీరమల్లును నిజంగా టార్గెట్ చేస్తే మాత్రం టార్గెట్ చేసిన వాళ్లకు ఇబ్బందులు తప్పవనే సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ నటించి విడుదలైన సినిమాలను ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితి ఉండటం ఏంటనే చర్చ జరుగుతోంది. హరిహర వీరమల్లు మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.
హరిహర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ లుక్స్ సైతం అదిరిపోయాయనే సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ హిట్టైతే పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవన్ కళ్యాణ్ మరిన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతున్నాయి. పవన్ మల్టీస్టారర్ సినిమాలలో నటించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. వీరమల్లు మూవీ ప్రమోషన్స్ లో పవన్ పాల్గొంటారో లేదో చూడాల్సి ఉంది.