- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందు థియేటర్ ల బంద్ తెర‌ మీదకు రావటం .. జూన్ 1వ తేదీ నుంచి ఎగ్జిబిటర్లు అందరూ థియేటర్లు మూసివేయాలని నిర్ణయించడం .. ఇందుకు ఫిల్మీ ఛాంబర్ కూడా మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా అంగీకారం చేయటం తెలిసిన సంగతే. తాజాగా ఈ విషయం పొలిటికల్ గా కూడా యూటర్న్ తీసుకుంది. థియేటర్ల బంద్‌ వెనక ఎవరు ఉన్నారో తేల్చాలని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేయడం ఏకంగా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి టాలీవుడ్కు వార్నింగ్ ఇచ్చేలా ఘాటుగా లేఖ రాయడం తెలిసిందే.


ప‌వ‌న్ టాలీవుడ్‌కు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడంతో పాటు టాలీవుడ్ లో లెక్కల బొక్కలు అన్ని తనకు తెలుసని ... అందరి లెక్కలు తేనిస్తాన‌ని చెప్పడంతో ఒక్కసారిగా బంద్‌ వ్యవహారం గప్చుప్ అయిపోయింది. దీని వెనక ఎవరు ఉన్నారు ? అన్నది కూడా పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా తెలుసు అన్న చర్చలే టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఎప్పటికి ఇప్పుడు కావాలని తన సినిమా రిలీజ్ కి ముందు థియేటర్ల బంద్ ను తెరమీదకు తెచ్చింది కూడా టాలీవుడ్ను మరియు ముఖ్యంగా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ శాసిస్తున్న ఆ నలుగురు ఉన్నారని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు .. లేదా ఇండ‌స్ట్రీ జ‌నాలు వ్య‌క్తిగ‌త ప‌నుల కోసం నా వ‌ద్ద‌కు రావొద్ద‌ని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అంద‌రూ క‌లిసి రావాల‌ని తెలిపారు. ఇక ఇండ‌స్ట్రీ విష‌యం లో ప‌వ‌న్ త‌న దైన స్టైల్లోనే ముందుకు వెళ‌తార‌ని ... ఈ విష‌యం రాజీ కి రాక‌పోతే ఇండ‌స్ట్రీ లో ఆ పెద్ద‌ల‌కు ప‌వ‌న్ ఇక చుక్క‌లే చూపిస్తార‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: