
సెప్టెంబర్ 5న ఎనిమిది భాషల్లో మిరాయ్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్ విడుదల చేసింది. `జరగబోయేది మారణ హోమం.. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టే ఏ శక్తి దీన్ని ఆపలేదు` అంటూ జయరామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ అధ్యంతం ఆసక్తిగా సాగుతూ ఆకట్టుకుంది. త్రేతా యుగం, కలియుగం మధ్య లింక్ ఉన్నట్లుగా టీజర్ లో చూపించారు.
డిఫరెంట్ మేకోవర్ లో మనోజ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. `ఇది మహా వీలునామా.. భూమి మీద చేయబోయే సంతకం` అంటూ మనోజ్ చెప్పిన డైలాగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. అలాగే హీరో తేజ సూపర్ యోధగా కనిపించబోతున్నాడు. సాహస సన్నివేశాల్లో అటు మనోజ్, ఇటు తేజ ఇద్దరూ చెలరేగిపోయారు. టీజర్ లో స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో మేకర్స్ గుస్‌బంప్స్ తెప్పించారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, లాస్ట్ షాట్ లో రాముని రాక మరియు గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి. మొత్తంగా మిరాయ్ టీజర్ టాప్ లేపేసింది. టీజర్ సూపర్.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ మూవీ లవర్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు.