మామూలుగానే నయనతారకు కాస్త పొగరు ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది ఇండస్ట్రీ జనాలు అంటారు. ఇక మరికొంతమంది దర్శక నిర్మాతలు, నయనతారతో ట్రావెల్ చేసిన వారు అయితే కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో బహిరంగం గానే ఈ విషయాన్ని బయట పెట్టారు. అయితే అలాంటి నయనతారహీరో పరువు పూర్తిగా తీసేసింది.100 కోట్లు ఇచ్చిన సరే ఆయనతో నటించా అని మొహం మీదే చెప్పి ఆయన తల తీసేసినట్టు చేసింది. మరి ఇంతకీ 100 కోట్లు ఇచ్చినా కూడా నటించను అని ఏ హీరోతో చెప్పింది.. ఇంతకీ నయనతారకు ఆ హీరో అంటే ఎందుకు పడదు అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ని అందుకున్న నయనతారకి ఏజ్ పెరిగినా కూడా ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు.ఇద్దరు పిల్లల తల్లి అయినా ఈ ముద్దుగుమ్మ తగ్గేదేలే అన్నట్లు  వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.

తాజాగా అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయింది.ఇక ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని సినిమా షూటింగ్ కూడా జరుపుకోక ముందే అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు.ఈ విషయం పక్కన పెడితే తాజాగా నయనతారహీరో గురించి చేసిన కొన్ని కామెంట్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. నయనతారకి ఓ హీరో సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిందట.కానీ నయనతార మాత్రం 100 కోట్లు ఇచ్చిన సరే ఆ హీరోతో నేను అస్సలు నటించను అని మొహం మీదే చెప్పిందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే శరవణన్.. తమిళనాడులో శరవణన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శరవణన్ ఫ్యామిలీ లో నుండి ఫస్ట్ టైం ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ది లెజెండ్ అనే మూవీ తో శరవణన్ హీరోగా మారారు.

అయితే ది లెజెండ్ మూవీలో హీరోయిన్ గా మొదటి ఛాన్స్ నయనతారకే వచ్చిందట.అయితే నయనతార ఈ సినిమాలో నటిస్తే సినిమాకి మరింత హైప్ ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ది లెజెండ్ చిత్ర యూనిట్ నయనతారని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారట. అయితే హీరో ఎవరో చెప్పకుండానే నయనతార కి స్టోరీ చెప్పారట. చివర్లో హీరో ఎవరు అని అడగగా శరవణన్ పేరు చెప్పడంతో ఛీ ఛీ 100 కోట్లు ఇచ్చినా సరే ఆయనతో నేను నటించా అని మేకర్స్ మొహం మీదే రిజెక్ట్ చేసిందట.దాంతో నయనతారని పక్కన పెట్టి బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలాను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారట.అయితే ది లెజెండ్ సినిమా విడుదలైనప్పటి నుండి నయనతార ఈ కామెంట్లు చేసింది అని కోలీవుడ్ టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించినా కూడా దీనిపై అటు శరవణన్ గానీ ఇటు నయనతార గాని స్పందించలేదు. అంటే ఇది రూమరే కావచ్చు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: