
కాగా ఇదే మూమెంట్లో స్పిరిట్ సినిమాలో దీపిక పదుకొనే అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇంకా మామూలుగా ఆమె పేరు ట్రెండ్ అవ్వలేదు .. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోయింది. అయితే ఆమె సినిమా కోసం 20 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది అని .. ఆమె క్యారెక్టర్ సందీప్ రెడ్డివంగా చాలా హైలెట్ అయ్యే విధంగా రాసుకున్నాడు అని .. సినిమాలో బోల్డ్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అని .. ఆ కారణంగానే 20 కోట్లు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసింది అన్న వార్త బాగా ట్రెండ్ అయింది . అయితే కరెక్ట్ గా మూడు అంటే మూడు రోజుల్లోనే దీపికాని సినిమాలో నుంచి తప్పిస్తూ ఆ ప్లేస్ లోకి తృప్తి హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించిన కొన్ని గంటలకి అఫీషియల్గా సందీప్ రెడ్డి - తృప్తి ఈ సినిమాలో నటించబోతుంది అంటూ అనౌన్స్ చేశాడు .
దీనితో సోషల్ మీడియా వ్యాప్తంగా దీపిక పదుకొనే - తృప్తి పేర్లు మారుమ్రోగిపోయాయి . సడన్గా సందీప్ రెడ్డి - దీపికా పదుకొనేను పరోక్షకంగానే బ్యాడ్ చేశారు . "ఒక పెద్ద హీరోయిన్ కి నమ్మి కథ చెప్పితే ఆమె తన పిఆర్ టీం తో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయించింది. సినిమా మొత్తం లీక్ చేసుకున్న ప్రాబ్లం లేదు ..నాకు కధా కంటెంట్ పై నమ్మకం ఉంది" అన్న రేంజ్ లోనే ఘాటుగా ఇచ్చి పడేసాడు. దానికి తగ్గట్టే దీపిక కూడా కౌంటర్ వేసింది . "నాకంటూ కొన్ని నీతి నియమాలు ఉన్నాయి అంటూ పరోక్షకంగానే సందీప్ రెడ్డివంగా కి కౌంటర్ వేసింది".
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దీపికా పదుకొనే కి సంబంధించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కేవలం దీపిక పదుకొనే ఈ సినిమా విషయంలో మాత్రమే ఇలా చేయలేదు అని .. గతంలో చాలామంది డైరెక్టర్స్ ని ఇలాగే బెదిరించి బ్లాక్ మెయిల్ చేసింది అని.. స్టోరీ చెప్పడానికి ఇంటికి వస్తే చాలా సాఫ్ట్ గా మాట్లాడే దీపికా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఆమెకు నచ్చిన అమౌంట్ ఇవ్వకపోతే స్టోరీ మొత్తం లీక్ చేసేస్తాం అంటూ బెదిరించేది అని.. బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ నే మాట్లాడుకుంటున్నారు .
అంతేకాదు దీపికా పదుకొనే గ్లోబల్ బ్యూటీ కావడంతో ఆమె పేరు బయటికి వస్తే తమ సినిమాలకు ప్రాబ్లం అవుతుంది అన్న కారణంగా కొంతమంది డైరెక్టర్స్ చూసి చూడనట్టు వదిలేసారట. కానీ సందీప్ రెడ్డివంగా చాలా షార్ప్ డైరెక్టర్. ఎదుట ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఇచ్చిపడేస్తాడు . ఆ కారణంగానే దీపిక నిజస్వరూపాలను బయట పెట్టాడు అంటూ మాట్లాడుతున్నారు బాలీవుడ్ జనాలు . అంతేకాదు ఇప్పుడు ఆమె ఖాతాలో ఉన్న రెండు సినిమాలు కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది . దీన్ని బట్టి సందీప్ రెడ్డి ఉసురు బాగానే దీపికకి తగిలింది అంటున్నారు జనాలు..!