తెలుగు సినీ పరిశ్రమ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు . ఇకపోతే ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు . అందులో అనేక మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నా డు . దానితో ఈయన చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించాడు . కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. దానితో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది.

ఇకపోతే పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో టబు కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ మూవీ లో టబు తో పాటు రాధిక ఆప్టే కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తుండడంతో మొత్తానికి పూరీ జగన్నాథ్ ఏదో పెద్ద ప్లాన్ ఈ మూవీ తో చేసినట్లే కనిపిస్తున్నాడు అనే అభిప్రాయాలను జనాలు వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను అనుకుంటున్నాట్లు ఓ వార్త వైరల్ అయింది. కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్ ను అనుకోలేదు అని క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ సినిమాకు ఏ టైటిల్ ను కన్ఫామ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: