టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ చిరంజీవి కెరీర్లో 157 మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని మెగా 157 వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార కనిపించబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు.

బీమ్స్ సిసిరిలియో ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇకపోతే అనిల్ రావిపూడి ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ ను అనుకున్న దాని కంటే ఒకే రోజు ముందుగానే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇలా అనిల్ రావిపూడి మొదటి షెడ్యూల్ ను అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే పూర్తి చేయడంతో తన వర్కింగ్ స్టైల్ చూసి చిరు ఫిదా అయిపోయినట్లు తెలుస్తోంది. అనిల్ అద్భుతమైన స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేస్తూ వస్తుండడంతో చిరు తెగ ఆనంద పడిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో చిరు కి జోడిగా నటిస్తూ ఉండగా .. ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: