
అదే లిస్టులోకి వస్తుంది ప్రభాస్ అమ్మగారు . ఇప్పటివరకు ప్రభాస్ అమ్మగారు ప్రభాస్ నటించిన గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు . ఎక్కువ ప్రశంసించలేదు . కానీ ప్రభాస్ నటన అంటే మాత్రం వాళ్ళ అమ్మగారికి చాలా చాలా ఇష్టం . ఈ విషయాన్ని ఆమె వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చాలా సార్లు బయటపెట్టిందట . ప్రభాస్ ఎన్నో సినిమాలల్లో నటించాడు . 100 కోట్లు అందుకున్న పాన్ ఇండియా మూవీలో నటించాడు. వేల కోట్లు కొల్లగొట్టిన బాహుబలి సినిమాలో నటించాడు . అయితే ప్రభాస్ తల్లికి మాత్రం ఆయన నటించిన ఫస్ట్ సినిమా అంటే మహా మహా ఇష్టమట .
"ఈశ్వర్" సినిమా అంటే ప్రభాస్ తల్లికి చాలా ఇష్టమట. ఎప్పుడూ కూడా ఆమె ఆ సినిమాని ఎక్కువగా లైక్ చేస్తుందట. ఆ సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ..ప్రభాస్ డైలాగ్ డెలివరీ.. ప్రభాస్ నటన స్టైల్.. ప్రభాస్ అమాయకత్వం.. ప్రభాస్ యాక్షన్ మోడ్ అంతా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది అని .. మొదటి సినిమాలో తన కొడుకు నటించిన తీరు చాలా అద్భుతంగా ఉంది అని ఆమె స్వయంగా ఆమె బయటపెట్టారట . ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏంటి..? అని అడిగితే మాత్రం ఖచ్చితంగా "ఈశ్వర్" సినిమా పేరు చెబుతుందట ఆమె. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. కాగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు . చేతిలో దాదాపు అరడజనకు పైగానే పాన్ ఇండియా సినిమాలను పెట్టుకుని ఉన్నాడు . సినిమాల విషయంలో దూసుకెళ్తున్న ఈ హీరో పెళ్లంటే మాత్రం భయపడిపోతున్నాడు. అసలు పెళ్లి చేసుకుంటాడు అన్న నమ్మకాలు కూడా జనాలకు లేవు..!