
ప్రెసెంట్ అనిల్ రావిపూడి చిరంజీవితో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా ఆల్మోస్ట్ 40% షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది . నెక్స్ట్ షెడ్యూల్ లో ఐటం సాంగ్ కూడా చిత్రీకరించబోతున్నారట. ఈ సాంగ్లో పూజా హెగ్డే కనిపించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే చిరంజీవి సినిమాతోనే ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ ప్రారంభమయ్యేలా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి అన్న వార్త ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ఒక కొత్త పనిని ప్రారంభించబోతున్నారట. ఇకపై ఆయన ఏ హీరోతో డైరెక్ట్ చేసిన సరే ఆ హీరో ఏ హీరోలతో నటించాలి అనుకుంటున్నాడు..? లేదంటే ఆ హీరోకి ఇష్టమైన హీరోలు ఎవరు ..? అనే విషయం తెలుసుకొని ఆ ఇద్దరి హీరోలను సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించాలని డిసైడ్ అయ్యారట .
ఇప్పుడు చిరంజీవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా ప్రభాస్ లను గెస్ట్ పాత్రలో చూపించాలి అంటూ ఫిక్స్ అయ్యారట అనిల్ రావిపూడి . స్వయాన మెగాస్టార్ చిరంజీవినే ఇలా ఇద్దరు హీరోలతో కలిసి నటించాలి అనుకుంటున్నాను అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారట . ఇక నెక్స్ట్ అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాల హీరోలు అందరి విషయంలోనూ ఇదే కొత్త ట్రెండ్ కంటిన్యూ చేయబోతున్నాడు అంటూ కూడా సినీ వర్గాలలో న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి సినిమాలో ఎన్టీఆర్ - ప్రభాస్ ని అంటూ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . నిజంగా ఇదొక ట్రెండ్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు కన్ఫామ్..!!