
అయితే తాజాగా ఈ బ్యూటీ తన అమ్మ నాన్న విడాకులపై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. `మా నాన్న కమల్ హాసన్, అమ్మ సారిక నా చిన్నప్పుడే విడిపోయారు. అందుకు నేను ఏమాత్రం బాధపడలేదు. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఎందుకంటే, కలిసి ఉండి బాధపడే కన్నా, విడిపోయి సంతోషంగా ఉండడమే బెటర్. మా అమ్మ-నాన్న విడిపోవడం మంచిదే అయింది. ప్రస్తుతం వారిద్దరితో నాకు మంచి రిలేషన్ ఉంది` అంటూ శృతి హాసన్ పేర్కొంది.
అలాగే నాన్నతో విడాకులు తీసుకున్నాక అమ్మ జీవితం తనకెంతో ప్రేరణగా నిలిచిందని.. ఆర్థికంగా, మానసికంగా, స్వతంత్రంగా నిలబడటం ఎంత ముఖ్యమో అమ్మను చూసే నేర్చుకున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా, 1984లో `రాజ్ తిలక్` మూవీ షూటింగ్‌లో కమల్ హాసన్, సారికలకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారగా.. 1988లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సారిక కన్నా ముందు వాణి గణపతితో కమల్ కు వివాహం జరిగింది. పదేళ్ల దాంపత్య జీవితం తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.
అదే టైమ్‌లో సారికతో కమల్ హాసన్ ఏడడుగులు వేశారు. ఈ దంపతులకు శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. దాదాపు 14 ఏళ్ళ పాటు కలిసి జీవించిన కమల్ హాసన్, సారిక జంట.. 2002లో సపరేట్ అయ్యారు. 2004లో వీరికి విడాకులు వచ్చాయి. అనంతరం ప్రముఖ నటి గౌతమితో కమల్ లీవ్‑ఇన్ లో ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు.. కానీ 13 ఏళ్లు కలిసున్నారు. 2016లో వీరు కూడా విడిపోయారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.