టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. విభిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్న నిఖిల్ తాను నటిస్తున్న "ది ఇండియన్ హౌస్" సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో ఒక ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు సముద్రానికి సంబంధించి ఒక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్స్ లోకి మొత్తం నీరు చేరిపోయినట్లు తెలుస్తోంది.



దీంతో అక్కడ ఉండే కెమెరాలు ఇతర షూటింగ్ సామాగ్రి కూడా మొత్తం నీటిమట్టమైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్రమైన గాయాలైనట్లుగా సమాచారం. వీరికి తోడు మరి కొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే వీరి హాస్పిటల్ కి తరలించి మరి మెరుగైన వైద్యం అందిస్తున్నారట. హీరో నిఖిల్ కి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం వాటర్ ట్యాంక్ పగిలిపోవడమే అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలో జరిగినట్లుగా తెలుస్తోంది.


ఇదే కాకుండా నిఖిల్ స్వయంభు అనే ఒక హిస్టారికల్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగు కూడా శరవేగంగా చేస్తూ ఉన్నారు. హీరో నిఖిల్  సినిమా విడుదల కాక ఇప్పటికీ ఏడాది పైనే కావస్తోంది. అలాగే కార్తికేయ 3 సినిమా కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి తాజాగా జరిగిన ఈ సంఘటన పైన హీరో నిఖిల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. తన తదుపరి సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా నిఖిల్ సినిమాలు మంచి లాభాలను తీసుకువచ్చేలా చేస్తున్నాయి. అందుకే హీరో నిఖిల్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకనిర్మాతలు మక్కువ చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: