ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఇంటిమేట్ సీన్స్ కి,లిప్ లాక్ సన్నివేశాలకు చాలా తొందరగా ఒప్పుకుంటున్నారు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. గతంలో ఉన్న చాలామంది హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాల్లో, ముద్దు సన్నివేశాల్లో నటించడానికి అంత ఈజీగా ఒప్పుకునే వారు కాదు. చాలామంది ఒప్పించడం వల్ల సినిమా కోసం బలవంతంగా ఒప్పుకునేవారు. అలాంటి వారిలో కన్నప్ప మూవీ లో నటించిన ఈ నటి కూడా ఒకరు. ఆమెనే మధుబాల..రోజా మూవీతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ మధుబాలసినిమా కోసం ముద్దు సన్నివేశంలో నటించిందట.అయితే అప్పటి వరకు మధుబాల సినిమాల కోసం తన రూల్స్ ని బ్రేక్ చేయలేదట. 

ఏ సినిమాలో కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో,ముద్దు సన్నివేశాలలో నటించలేదట. కానీ మొదటిసారి ఓ సినిమాలో డైరెక్టర్ లిప్ లాక్ సీన్ చేయాలి అని చెప్పారట.అయితే ఈ సీన్ చేయడానికి నేను రెడీగా లేను నేను చేయను నాకు మీరు ముందే చెప్పలేదు అని మధుబాల డైరెక్టర్ తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిందట.కానీ ఆ తర్వాత సినిమాలో చేసే మరికొంతమంది వచ్చి ఈ లిప్ లాక్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.ఈ సీన్ మీరు చేయనంటే సినిమాకి మైనస్ అవుతుంది అని సర్ది చెప్పారట. దాంతో మధుబాల తనకు తానే రియలైజ్ అయ్యి సినిమా అంటే ప్రతి ఒక్కటి చేయగలగాలని నిర్ణయించుకొని చివరికి లిప్ లాక్ సీన్లో చేసిందట.

అయితే అంత కష్టపడి బలవంతంగా ఈ లిప్ లాక్ సీన్ చేస్తే చివరికి ఎడిటింగ్ లో ఆ లిప్ లాక్ సీన్ తీసేసారట. దాంతో ఎంతో కష్టపడి ఈ లిప్ లాక్ సీన్ చేస్తే కనీసం నా కష్టానికి గుర్తింపు ఇచ్చి ఈ లిప్ లాక్ సీన్ ఉంచలేదు అని బాధపడిందట. కానీ డైరెక్టర్ తో గొడవ అయితే పెట్టుకోలేదట. ఎందుకంటే నటిగా అన్ని రకాల సన్నివేశాల్లో నటించాలి అని మధుబాల అప్పుడే నిర్ణయించుకుందట. అంతేకాదు కొంతమంది నటీనటులను చూసి సినిమాల్లో ఎలా ఉండాలి అనేది నేర్చుకుందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా నటి మధుబాల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇక హీరోయిన్ మధుబాల ప్రస్తుతం కన్నప్ప మూవీలో ఓ కీ రోల్ పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: