తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తారక్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లైనప్ ను సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే తారక్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మరో వైపు తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై కూడా ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ అంచనాలు ఉన్నాయి. ఇలా రెండు భారీ సినిమాలలో నటిస్తున్న తారక్ ఇప్పటికే సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ విషయాన్ని తారక్ కొంత కాలం క్రితం ఓ సినిమా ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. ఇక సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తారక్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న రెండు సినిమాలలో నటిస్తూ , మరో రెండు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్ అద్భుతమైన రేంజ్ లో లేనప్ ను మైంటైన్ చేస్తున్నాడు. దీనితో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అది ఇందులో అనుకుంటున్నారా ..? తారక్ ఆఖరిగా దేవర పార్ట్ 1 సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ సినిమా సీక్వెల్ ఇంకా ప్రారంభం కాలేదు. దేవర పార్ట్ 2 ను ప్రారంభించకుండా తారక్ ఇతర మూవీలకు కమిట్ అవుతూ ఉండడంతో ఆయన అభిమానులు దేవర పార్ట్ 2 విషయంలో కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: